'హైదరాబాద్ సంస్థాన విమోచనం': సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన వేడుకలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం 79వ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ ప్రాముఖ్యతను చాటిచెప్పేలా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. విమోచన పోరాటయోధుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.