మెదక్ జిల్లాలో ఘోర విషాదం: బిర్యానీ తిని యువకుడు దుర్మరణం

రిపోర్టర్: సురేష్ స్థలం: Medak

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని వన్ ప్యాలెస్ రెస్టారెంట్లో విషాదం చోటుచేసుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. అక్కడ మండీ బిర్యానీ తిన్న పలువురు తీవ్ర అస్వస్థతకు గురికాగా, చికిత్స పొందుతూ సాయిరాం అనే పంతొమ్మిదేళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో పదిహేను మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. ఈ అవాంఛనీయ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.