నామినేషన్ కేంద్రాల భద్రతను తనిఖీ చేసిన ఎస్పీ బిందుమాధవ్
రిపోర్టర్: రమేష్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లాలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రాల భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ పరిశీలించారు. కరప ఎంపీడీవో కార్యాలయం మరియు జిల్లా పరిషత్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎలాంటి వెనుకంజ వేయకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.