అసెంబ్లీకి రాకుండా వైఎస్ జగన్ పారిపోతున్నారంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సురేష్
స్థలం: బాపట్ల
అసెంబ్లీకి రాకుండా విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదా రాలేదనే నెపంతో ప్రజల సమస్యలపై చర్చించాల్సిన శాసనసభకు రాకుండా జగన్ అలిగి కూర్చున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, ప్రజలే నిజమైన ప్రతిపక్షంగా మారారని ఆయన స్పష్టం చేశారు.