ఢిల్లీలో కలకలం: కాక్రోచ్ జనతా పార్టీ నేతల విడుదలపై ఉత్కంఠ

రిపోర్టర్: అశోక్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంక్రిల ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగిసినట్లు ఆ పార్టీ లీగల్ అఫైర్స్ హెడ్ రత్నా సింగ్ వెల్లడించారు. వెంటనే వారిని విడుదల చేయాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టిన వీరిద్దరిని పోలీసులు గతంలో అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తో సంప్రదింపులు జరిపినట్లు ఆమె తెలిపారు.