భారత పేసర్ క్రాంతి గౌడ్‌కు మ్యాచ్ ఫీజులో కోత
రిపోర్టర్: రమేష్
స్థలం: Dubai
మహిళల ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన భారత పేసర్ క్రాంతి గౌడ్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్‌ను అవుట్ చేసిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో మ్యాచ్ రెఫరీ ఈ చర్య తీసుకున్నారు. ఆమె రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేర్చారు.