మహిళా ఎమ్మెల్యేలపై దాడి ఆరోపణలను ఖండించిన మంత్రి సీతక్క
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
శాసనసభ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగిందన్న ఆరోపణలపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. సబితా ఇంద్రారెడ్డిని నిజంగానే ఎవరైనా కొట్టారా? సునీతా లక్ష్మారెడ్డి చీరను లాగారా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఆరోపణలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని, రాజకీయ లబ్ధి కోసం అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలని సీతక్క హితవు పలికారు.