రామాయణం సినిమా ట్రోలింగ్ పై స్పందించిన నటుడు రణ్బీర్ కపూర్

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

తాను నటిస్తున్న రామాయణం సినిమాపై వస్తున్న ట్రోలింగ్ను పట్టించుకోనని బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ స్పష్టం చేశారు. విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో జరిగే విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని వెల్లడించారు. కిషోర్ కుమార్ పాడుకున్న ప్రసిద్ధ పాటలోని చరణాలను గుర్తుచేస్తూ, ప్రజల విమర్శలను తత్వశాస్త్రంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. తనను ఆదరించే వారి అభిప్రాయాలకే తాను ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని ఆయన తెలిపారు.