రోడ్డు ప్రమాదం గమనించి స్పందించిన మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
రిపోర్టర్: రమేష్
స్థలం: మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని రంగారెడ్డి గూడ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన వి. శ్రీనివాస్ గౌడ్ - మాజీ మంత్రి, మహబూబ్ నగర్ వెంటనే స్పందించారు. తన వాహనం నుంచి దిగి కారులో తీవ్రంగా చిక్కుకున్న బాధితులను సురక్షితంగా బయటకు తీశారు. క్షతగాత్రులను తక్షణమే ఆసుపత్రికి తరలించేందుకు తగిన సహాయం అందించి, వారికి ధైర్యం చెప్పారు. మానవతా దృక్పథంతో వ్యవహరించిన ఆయన క్షతగాత్రులకు అండగా నిలిచారు.