ఓటీటీ విడుదల తర్వాత కూడా థియేటర్లలో రవితేజ ఇరుముడి హౌస్ఫుల్స్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hindupur

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఇరుముడి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ థియేటర్లలో అద్భుతమైన ఆదరణ పొందుతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. విడుదలైన 38 రోజులు పూర్తయినా కూడా హిందూపురంలోని ఎస్వీ సినిమాక్స్లో మొదటి ఆటకు హౌస్ఫుల్ బోర్డు పడిందని చిత్ర బృందం పేర్కొంది. కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలివస్తుండటంతో వసూళ్ల జోరు కొనసాగుతోందని, ప్రపంచవ్యాప్తంగా సినిమా రెండు వందల యాభై కోట్ల గ్రాస్ మార్క్ను దాటిందని తెలిపారు.