భారత్, చైనా కలిసి విజయం సాధించవచ్చు: జిన్ పింగ్
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ఏడేండ్ల తర్వాత భారత్‌కు వచ్చిన ఆయన, ఇరు దేశాలు ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకోవచ్చని, పరస్పరం మద్దతు ఇచ్చుకోవచ్చని అన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం రెండు దేశాలు కలిసి పనిచేయాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.