'ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి': ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు
రిపోర్టర్: సతీష్
స్థలం: Prakasam
ప్రకాశం జిల్లాలో నిర్వహించిన 'మీకోసం' ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 100 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ.. ప్రజల ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.