తుఫాను ప్రభావిత ప్రాంతాల్ లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో తుఫాను తాకిడికి గురైన గుంటూరు, ప్రకాశం మరియు బాపట్ల జిల్లాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైమానిక సర్వే నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ ల్యాండ్ కాకపోవడంతో గాల్లోంచే ముంపు తీవ్రతను ఆయన పరిశీలించారు. అనంతరం అమరావతి సచివాలయంలో ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించి సహాయక చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.