యాదగిరిగుట్ట మహాసభలకు బయలుదేరిన ఖమ్మం AIYF ప్రతినిధులు

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

యాదగిరిగుట్టలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న AIYF రాష్ట్ర మూడవ మహాసభలకు ఖమ్మం జిల్లా ప్రతినిధులు తరలివెళ్లారు. ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్ వద్ద AIYF జెండా ఊపి బస్సును నాయకులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి నానబాల రామకృష్ణ మాట్లాడుతూ, యాదగిరిగుట్టలో నిర్వహించే యువజన మహా ప్రదర్శన, బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CPI జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు, AIYF జిల్లా కార్యదర్శి చింతల రమేష్ పాల్గొన్నారు.