స్థానిక పోరులో ఊహించని షాక్: పలువురు ప్రధాన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ

రిపోర్టర్: రాజేష్ స్థలం: Amaravati

గ్రామీణ ప్రాంతంలో ఓటు హక్కు లేకపోవడం మరియు వయోపరిమితి నిబంధనల కారణంగా పలువురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకున్న వారిలో బొత్స సత్యనారాయణ సోదరుడి కుమారుడు చైతన్యబాబుతో పాటు కేఈ ప్రభాకర్ కుమారుడు కేఈ రుద్రఫణి నామినేషన్లు కూడా రద్దయ్యాయి. నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో ఓటు లేకపోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.