ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఎన్టీఆర్
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ మేరకు పోలీస్ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలు, అర్హతలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.