కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన చంద్రబాబు నారా లోకేష్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లాలో గతంలో నష్టపోయిన 164 మంది కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ద్వారా అమాయక కార్యకర్తల పిల్లలందరినీ ఉన్నత చదువులు చెప్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.