నియోజకవర్గాల అభివృద్ధికి కోటి రూపాయల నిధులు కేటాయింపు

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

అమరావతిలో జరిగిన తెలుగుదేశం లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రతి నియోజకవర్గంలో చిన్న సమస్యల పరిష్కారానికి కోటి రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని, 2029 ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు.