కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చంద్రబాబు భావోద్వేగం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Kuppam

నారావారిపల్లె తనకు జన్మను ఇస్తే, రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది మాత్రం కుప్పం నియోజకవర్గమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. కుప్పం ఎప్పుడూ తన గుండెల్లో ఉంటుందని, ఇక్కడి ప్రజలు తనను సొంత కుటుంబసభ్యుడిలా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు చూపPిస్తున్న ఈ ఆప్యాయత తన పూర్వజన్మ సుకృతమని, కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ఆయన స్పష్టం చేశారు.