దిల్లీలో తీవ్ర వాయుకాలుష్యం: సీజన్ లోనే తొలిసారిగా పడిపోయిన గాలి నాణ్యత
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New Delhi
దేశ రాజధాని దిల్లీలో వాయుకాలుష్యం తీవ్రరూపం దాల్చింది. బుధవారం ఉదయం గాలి నాణ్యత సూచీ (AQI) 227కి పడిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) అధికారులు వెల్లడించారు. దసరా వేడుకలు, దుర్గాపూజా ఉత్సవాలలో పెద్ద ఎత్తున కాల్చిన టపాసులు, పంజాబ్, హర్యానాలో కొనసాగుతున్న వ్యవసాయ వ్యర్థాల దహనం, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా నగరంలో కాలుష్యం ఒక్కసారిగా పెరిగింది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.