పంట కాలువల తవ్వకాల్లో రూ.కోట్ల నిధుల దుర్వినియోగం

రిపోర్టర్: రాజేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో పంట కాలువల తవ్వకాల పేరుతో నీటిపారుదల, ఉపాధిహామీ శాఖల అధికారులు భారీగా నిధులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకే కాలువను రెండు శాఖలు తవ్వినట్లు చూపిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఐదేళ్లలో సుమారు ఐదు కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు సోషల్ ఆడిట్లో వెలుగుచూసింది. అధికారుల సమన్వయలోపం, సిబ్బంది అవినీతి కారణంగా ప్రభుత్వ సొమ్ము నీళ్లపాలవుతోందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.