కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడి లారీ దగ్ధం
రిపోర్టర్: రమేష్
స్థలం: కడప
కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో సిమెంట్ లారీ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగడంతో డ్రైవర్, క్లీనర్ సజీవదహనమైనట్లు సమాచారం. అటవీ ప్రాంతం కావడంతో మంటలు చెట్లకు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలనుార్పుతున్నారు.