ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఖమ్మం జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర టి.ఎస్ తెలిపారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1077, సెల్ నంబర్ 90632 11298లను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. వరదలకు సంబంధించిన ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని కోరారు.