జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్: కేటీఆర్ వ్యాఖ్యలతో రాష్ట్రంలో తీవ్ర చర్చ

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

తెలంగాణ రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక పాత్ర పోషించనున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే దిశగా గులాబీ బాస్ అడుగులు వేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కేసీఆర్ రీఎంట్రీ ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.