'ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నారు?': ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలపై ఈయూ ఫైర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

టీజీఎస్ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియను అధికారులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారంటూ ఈయూ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నాలుగు నెలలు గడిచినా షెడ్యూల్ విడుదల చేయకపోవడంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు. ఎన్నికల జాప్యానికి నిరసనగా ఈ నెల 22న హైదరాబాద్‌లోని బస్ భవన్ నుంచి లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు చలో లేబర్ ఆఫీస్ మహా ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించి, కార్మికులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.