అమితాబ్ బచ్చన్ ఇంటి వద్ద ఉద్రిక్తత: బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ వెనుక అభిమానుల దర్శనం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ముంబయి

ముంబయిలో నటులపై వరుస బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన భద్రతను కట్టుదిట్టం చేసుకున్నారు. ముంబయిలోని తన జల్సా ఇంటి వద్ద ఆదివారం అభిమానులను కలిసేందుకు వచ్చిన ఆయన, మూడంచెల భద్రత మధ్య ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ షీల్డ్ వెనకాల నిల్చొని అభివాదం చేశారని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.