తూర్పుగూడెంలో ఘనంగా గణనాథునికి ప్రత్యేక పూజలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామంలో రాజరాజేశ్వరి యూత్ మరియు బద్ది పోచమ్మ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పంచమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ వార్డు మెంబర్ బండి రజిత రాజు గౌడ్ పాల్గొని గణనాథునికి భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు చేశారు. గ్రామంలో యువకులు ఉత్సాహంగా పాలుపంచుకుని వేడుకలను భక్తిభావంతో నిర్వహించారు.