సమయ్ రైనా కామెడీ షోలో నవాజుద్దీన్ సిద్ధిఖీపై సెటైర్లు

రిపోర్టర్: సురేష్ స్థలం: ముంబై

ప్రముఖ కమెడియన్ సమయ్ రైనా నిర్వహిస్తున్న తాజా కామెడీ షో ఎపిసోడ్‌లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, కాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ చబ్రా, భువన్ బామ్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమయ్ రైనా తనదైన శైలిలో అతిథులపై సెటైర్లు విసురుతూ నవ్వులు పూయించారు. ముఖ్యంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన సినిమాలపై, ముకేష్ చబ్రా కాస్టింగ్ విధానాలపై రైనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.