రైతుల విద్యుత్ కష్టాలకు శాశ్వత పరిష్కారంగా బలిరెడ్డిపల్లిలో నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ!

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఓబులవారిపల్లి

తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం బలిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి బుధవారం అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు మరియు స్థానిక రైతులు కలిసి వైభవంగా భూమిపూజ నిర్వహించారు. ఈ సబ్స్టేషన్ అందుబాటులోకి వస్తే బలిరెడ్డిపల్లితో పాటు పరిసర గ్రామాల్లో లో-వోల్టేజీ సమస్యతో పాటు తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి నాణ్యమైన కరెంట్ సరఫరా కానుండటంతో స్థానిక రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులను త్వరితగతిన నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.