భక్తిశ్రద్ధలతో నవోదయ విద్యాలయంలో వినాయక చవితి వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మర్రిపాడు

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం నందుగల జవహర్ నవోదయ విద్యాలయంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులు ఇంచార్జ్ మున్సిపల్ చెన్నయ్య ఆధ్వర్యంలో వినాయక ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవోదయ విద్యాలయ బోధన మరియు బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు అందుకున్నారు.