రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా గురజాడ జయంతి

రిపోర్టర్: K NAGA SRINU స్థలం: రాజోలు

రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగంలో గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. పి. సాయిబాబు మాట్లాడుతూ ఆధునిక సాహిత్యానికి గురజాడ వెలుగు కాగడా అని, ఆయన రచనలు స్త్రీ స్వేచ్ఛ, సామాజిక సమానత్వం, దేశభక్తికి ప్రతీకలని పేర్కొన్నారు. విద్యార్థులు గురజాడ రచనలను చదివి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.