రూ.3,300 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే భిక్షాటన దీక్ష.. ఎందుకంటే?

రిపోర్టర్: శివ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని ఘాట్కోపర్ ఈస్ట్ భాజపా ఎమ్మెల్యే, రూ.3,300 కోట్ల ఆస్తులున్న పరాగ్ షా ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు జైన సంప్రదాయంలో భాగంగా భిక్షాటన దీక్ష చేపట్టారు. ముంబయి వీధుల్లో ఎవరికీ గుర్తుపట్టకుండా రోజంతా తిరిగి, దొరికింది తింటూ రోడ్లపైనే గడిపారు. ఈ దీక్ష ద్వారా తనకు జీవిత సత్యం, ముంబయి ప్రజల సహాయ గుణం అర్థమయ్యాయని ఆయన స్పష్టం చేశారు.