ఏదులాపురంలో అక్రమ బాణసంచా విక్రయాలపై భగ్గుమన్న స్థానిక ప్రజలు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం జిల్లా ఏదులాపురంలో ఎస్సార్ఆర్ ట్రేడర్స్ ఒకే లైసెన్స్ తో రెండు వేర్వేరు ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నివాస గృహాల మధ్య ఇలా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు విక్రయించడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు నిర్వహించి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.