భీమవరప్పాడులో టీడీపీ గెలుపే లక్ష్యంగా నాయకుల ముమ్మర ఇంటింటి ప్రచారం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కొండాపురం
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం భీమవరప్పాడులో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోరుతూ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న కార్యకర్తను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.