లవ్ అండ్ వార్ చిత్రంలో రణ్‌బీర్ ఫస్ట్ లుక్ విడుదల
రిపోర్టర్: రాజేష్
స్థలం: ముంబై
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం లవ్ అండ్ వార్ నుంచి రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రక్తం మరకలతో ఉన్న చొక్కా, రగ్‌డ్ లుక్‌లో రణ్‌బీర్ కనిపించడం విశేషం.