కవల పిల్లల ఫొటోలను తొలిసారి రివీల్ చేసిన నటి
రిపోర్టర్: సతీష్
స్థలం: India
ప్రముఖ నటి సంభావన సేత్ తన భర్త అవినాష్ ద్వివేదితో కలిసి కవల పిల్లల ముఖాలను తొలిసారిగా సోషల్ మీడియాలో పరిచయం చేశారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ కవలలు ధ్వజ మరియు యుగార్థ్‌ల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. పెళ్లైన దశాబ్దం తర్వాత సరోగసి ద్వారా వీరు ఈ ఏడాది జూన్‌లో కవల పిల్లలను స్వాగతించారు. అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.