రాష్ట్రంలో ఈ నెల 29న పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 29న పకడ్బందీగా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రతినిధులతో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. రాజకీయాలకు తావు లేకుండా పాఠశాలల అభివృద్ధికి, నిధుల వినియోగానికి ఈ కమిటీలు కృషి చేయాలని అధికారులు ఆదేశించారు.