పీఎంఏవై 2.0 సర్వే పారదర్శకంగా చేపట్టాలన్న ఎమ్మెల్యే గౌతు శిరీష

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో పీఎంఏవై 2.0 పథకం అమలుపై ఎమ్మెల్యే గౌతు శిరీష సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహం అందేలా డిమాండ్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కోరారు. సొంత ఇల్లు లేని అర్హులను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.