తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఎండలు ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎల్నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పగటి పూట ఎండల తీవ్రతతో పాటు రాత్రి వేళల్లోనూ విపరీతమైన ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోందని తెలిపారు. ఎక్కడా వర్షాలు కురిసే సూచనలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మధ్యాహ్నం పూట తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నట్లు పేర్కొన్నారు.