ఎన్నికల భద్రతపై పోలీస్ కమిషనర్ సమీక్ష: నగరంలో పటిష్ట నిఘా ఏర్పాట్లు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విశాఖపట్నం

జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించినట్లు VizagCityPolice వెల్లడించారు. నవంబర్ ఒకటిన పోలింగ్, మూడో తేదీన కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా ఉంచాలని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు.