చిరు వ్యాపారులను ఆదుకోవాలని బీజేపీ మహాధర్నాకు పిలుపు
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్ ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో డబ్బాలు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నారు. మున్సిపాలిటీ కార్యాలయం ముందు జరిగే ఈ నిరసన కార్యక్రమంలో మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ముఖ్య అతిథిగా పాల్గొంటారని మున్సిపాలిటీ అధ్యక్షులు కర్నాటి విక్రమ్ రెడ్డి తెలిపారు.