ఆకుతోటపల్లిలో అక్రమ క్రషర్ మైనింగ్ నిలిపివేయాలని దీక్షలు ఉధృతం

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆకుతోటపల్లి గ్రామ ప్రజలు క్రషర్ ఆపడం కోసం వరసగా దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. 302, 304 సర్వే నంబర్లలో ఏర్పాటు చేస్తున్న అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని ఎంఆర్వో ఆఫీస్ ముందు నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షలో శ్రీపాతి శశిధర్ రెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్ హాజీ, వార్డు సభ్యులు షైక్ సాజీద్, తెలగామల్ల విజయ్, షైక్ కాజమ్ పాల్గొన్నారు.