యువతకు ఉపాధి లక్ష్యంగా నైపుణ్య శిక్షణ: ఐదు లక్షల మందికి అవకాశం కల్పించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనతో పాటు వివిధ పథకాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతను నైపుణ్యం పోర్టల్లోకి తీసుకొచ్చి కృత్రిమ మేధస్సు ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించాలని పేర్కొంటూ, విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా జర్మన్, జపనీస్ భాషల్లో ప్రత్యేక శిక్షణ అందించాలని స్పష్టం చేశారు.