విజయనగరంలో కలకలం: ఓటర్లకు భారీగా నగదు మరియు బహుమతుల పంపిణీ
రిపోర్టర్: గోపి
స్థలం: విజయనగరం
విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారీగా నగదు, బహుమతులు పంపిణీ చేస్తున్నట్లు స్థానికులు మరియు అధికారులు తెలిపారు. ఎనుబది శాతం డివిజన్లలో ఓటర్ల స్లిప్పులతో పాటు ఒక్కో ఓటుకు వేయి నుంచి మూడు వేల రూపాయల వరకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్ లో ప్రత్యేక విందులు కూడా ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.