పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

జి.కె.వీధి మండలం రింతాడ యూపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులు సమావేశం నిర్వహించి తమ సమస్యలపై గళం విప్పారు. నెలల తరబడి పెండింగ్ లో ఉన్న జీతాలు మరియు కూరగాయల బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మండల అధ్యక్షులు కె. కుమారి తీవ్రంగా డిమాండ్ చేశారు. కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని, లేనిచో రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని అధికారులను హెచ్చరించారు.