పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్, కొత్త అడ్వాన్స్ రూల్స్ ఇవే!

రిపోర్టర్: విజయ్ స్థలం: India

పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌ఓ కొత్త అడ్వాన్స్ నిబంధనలను తీసుకువచ్చింది. అనారోగ్యం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం కోసం పీఎఫ్ డబ్బులను సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం మూడు కేటగిరీలుగా విభజించి అడ్వాన్స్ పొందే సదుపాయాన్ని కల్పించారు. మొత్తం బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు అడ్వాన్స్ తీసుకునేందుకు అవకాశం ఉంది.