ఫ్రిజ్ పేలిన ఘటనలో బాధితుడికి లక్షల నష్టపరిహారం
రిపోర్టర్: హరి
స్థలం: झारखंड
జార్ఖండ్లో రిఫ్రిజిరేటర్ పేలిన ఘటనపై వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు వెలువరించింది. గణేష్ కుమార్ అగర్వాల్ కొనుగోలు చేసిన ఫ్రిజ్ తరచూ మరమ్మట్లకు గురై చివరకు పేలిపోయింది. దీనిపై బాధితుడు ఆశ్రయించగా, సేవా లోపంగా నిర్ధారించిన కమిషన్ రూ.1.99 లక్షలు చెల్లించాలని ఎలక్ట్రానిక్స్ కంపెనీని ఆదేశించింది. కొత్త ఫ్రిజ్ ఖర్చుతో పాటు పరిహారం, న్యాయ ఖర్చులు కలిపి ఈ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.