దిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు నిర్వహణకు భారత్ సిద్ధం

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

బ్రిక్స్ కూటమికి 2026లో అధ్యక్షత వహిస్తున్న భారత్, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో దిల్లీలో 18వ శిఖరాగ్ర సదస్సును నిర్వహించనుంది. వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, సుస్థిర అభివృద్ధి ప్రధాన అజెండాగా ఈ సదస్సు జరగనుంది. సంక్షోభాలను తట్టుకునే ఆర్థిక వ్యవస్థలు, గ్లోబల్ సౌత్ అభివృద్ధికి భారత్ ప్రత్యేక ప్రతిపాదనలను ప్రపంచం ముందుంచనుంది.