భారతదేశానికి ప్రత్యేక స్పేస్ యాక్ట్ అత్యవసరం
రిపోర్టర్: సునీల్
స్థలం: India
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశం వేగంగా పెరుగుతున్నప్పటికీ, చట్టపరమైన రక్షణ కొరవడింది. పాలసీలు ఉన్నప్పటికీ పార్లమెంట్ ఆమోదించిన ప్రత్యేక స్పేస్ యాక్ట్ లేకపోవడం భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల మాదిరిగానే భారత్ కూడా తక్షణమే స్పేస్ చట్టాన్ని తీసుకొనిరావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.