షూటింగ్ ఛాంపియన్షిప్: ఒలింపిక్స్ కోటా సాధించలేకపోయిన క్రీడాకారిణి ఎలావెనిల్
రిపోర్టర్: విజయ్
స్థలం: Doha
దోహా వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ టోర్నమెంట్ లో భారత షూటర్ ఎలావెనిల్ వలరివన్ నిరాశపరిచారని క్రీడా వర్గాలు తెలిపాయి. మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఆరో స్థానంలో నిలిచిన ఆమె, తృటిలో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కోటాను కోల్పోయినట్లు నిర్వాహకులు వెల్లడించారు. తొలి నాలుగు స్థానాల్ లో నిలిచిన వారికి మాత్రమే ఒలింపిక్స్ బెర్త్ దక్కడంతో, గొప్ప ప్రదర్శన కనబరిచినా చివరి దశలో ఆమె వెనుకబడిపోయినట్లు సమాచారం.